|
|
 |
|
YEAR 2025
YEAR 2024
YEAR 2023
 |
|
డాక్టర్స్ డే వేడుకలు 01.07.2023 మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ – ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ఆధ్వర్యంలో డాక్టర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ముఖ్యఅతిథులుగా కమిషనర్ విజయసారధి, సీఐ నజీర్బేగ్లు పాల్గొన్నారు. డాక్టర్స్డే సందర్భంగా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ సురేంద్రనాథ్, ఏబీఆర్ డిగ్రి కళాశాల ప్రిన్సిపాల్ రవిచంద్రకుమార్, ఉల్లిపాలెం జడ్పీహైస్కూలు హెచ్ఎం నల్లూరి స్వర్ణలత, హింది ఉపాధ్యాయురాలు ఆకుల శివనాగజ్యోతిలకు సన్మానం నిర్వహించారు. అదేవిధంగా ఐఐఐటీ–జేఈఈలో జాతీయస్థాయిలో 28వ ర్యాంక్ సాధించిన ఐనంపూడి హర్షితను సత్కరించారు. ముగ్గురు విద్యార్ధులకు సైకిళ్లను, ప్రభుత్వ పాఠశాలలో చదివి అత్యధిక మార్కులు సాధించిన 10వతరగతి, ఇంటర్మీడియట్, డిగ్రి విద్యార్ధులు పలువురికి దాతల సహకారంతో రూ.1.5లక్షల ఉపకారవేతనాలను అందజేశారు. కుట్టుశిక్షణలో ప్రతిభ కనపరిచిన ఏ.నాగలక్ష్మికి కుట్టుమిషన్ను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో ఎంసీఏ అధ్యక్షుడు కోగంటి రత్నాకరబాబు, కార్యదర్శి పరుచూరి శ్రీనివాసరావు, ఐఎంఏ అధ్యక్షుడు ఎన్బీ రాజేంద్రప్రసాద్, కార్యదర్శి వసంతం వీరరాఘవయ్య, ఎంసీఏ సభ్యులు రామకృష్ణబాబు, హనుమంతరావు, డాక్టర్ ఏవీ సుబ్బారావు, నల్లూరి సునీత, బాపారావు, రామకృష్ణబాబు, కారుమూరు హర్షిత, ఎన్.వెంకట రత్నం, ఎ.నాగలక్ష్మి, నంబూరు సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
read more... |
 |
|
ఉగాది సంబరాలు 22.03.2023 మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కీ.శే.ప్రభల కృష్ణమూర్తి–నాగలక్ష్మి, లక్ష్మి నారాయణశాస్త్రి, సుజాత శ్రీరామ్ల జ్ఞాపకార్ధం వారి కుమారులు సుబ్రహ్మణ్యం, శ్రీరామ్ల ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కవుతా సత్యవెంకట నాగరాజేష్చే పంచాంగ శ్రవణం చేశారు. అదేవిధంగా వేదాంతం భవానీ రామలింగశాస్త్రి ఆధ్వర్యంలో కూచిపూడి నృత్యప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నృత్యప్రదర్శనలో ప్రతిభ కనపరిచిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంసీఏ సభ్యులు ప్రభల సుబ్రహ్మణ్యం, వాసుదేవరావు, వి.సాంబశివరావు, కె.రామస్వామి, కె.సాయి ప్రసాద్, వి.లక్ష్మీనారాయణ, చక్రపాణి, ఎస్. లోకేశ్వరరావు, కెవి.సుబ్బారావు,రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు.
read more... |
 |
|
ఉత్సాహభరితంగా భగవద్గీత కంఠస్థ పోటీలు 31.01.2023 మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించారు. పోటీలను ప్రధమ వర్గంలో ఆరేపాక యోక్షిత్, కూనపరెడ్డి వరీష్కార్తీక్, పి.జగదీష్లు, ద్వితీయ వర్గంలో సిహెచ్ రూపేశ్వరి, బొలిశెట్టి సుమశ్రీ, సిహెచ్ భార్గవ్‌లు, తృతీయ వర్గంలో గూడవల్లి వెంకట శివమణికంఠ, సిహెచ్ శ్రావ్య, కే.భవ్యశ్రీ, చతుర్ధవర్గంలో డి.పూజిత, ఎం.నాగసాయి, బి.అభిషేక్లు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయస్థానాలు సాధించారు. అదేవిధంగా ద్వితీయవర్గంలో చిరువోలు ఆరాధ్య, తృతీయ వర్గంలో పాగోలు హేమవర్షిణిలు ప్రోత్సాహక బహుమతులకు ఎంపికయ్యారు. కార్యక్రమంలో ఎంసీఏ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్ వేజళ్ల ప్రకాశరావు, వడ్లమూడి సాంబశివరావు, వీ.లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
read more... |
 |
|
కళ్ళజోళ్ళు పంపిణీ 21.01.2023 మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ మరియు మలిపెద్ది కృష్ణమూర్తి జ్ఞాపకార్ధం పరిమి బాలాజీ సహకారంతో శంకర్ కంటి ఆసుపత్రి వైద్య బృందంచే గత నెలలో నిర్వహించిన వైద్యశిబిరంలో శస్త్ర చికిత్సలు చేయించుకున్న పలువురికి ఉచితంగా కళ్ళజోళ్ళు, మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంసీఏ కార్యదర్శి బాపారావు, మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్ వేజళ్ళ ప్రకాశరావు, డాక్టర్ కే.వాసుదేవరావు, ప్రభల సుబ్రహ్మణ్యం, పరుచూరి బుచ్చిబాబు, నంబూరు సత్యప్రసాద్, వి.లక్ష్మీనారాయణ, వి.సాయేశ్వరరావు, వి.చక్రపాణి, శంకర్ కంటి ఆసుపత్రి సూపర్‌వైజర్ నాగబాబు తదితరులు పాల్గొన్నారు.
read more... |
YEAR 2022
 |
|
తానా చైతన్య స్రవంతి కార్యక్రమాలు 23.12.2022 మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తానా చైతన్య స్రవంతి కార్యక్రమాలలో భాగంగా పలువురు దాతల సహకారంతో గన్నే మల్లికార్జునరావు–సామ్రాజ్యంల జ్ఞాపకార్ధం వైద్యశిబిరాలు, సేవా కార్యక్రమాలు, సదస్సులు నిర్వహించారు. అనంతరం బాల్బ్యాడ్మింటన జాతీయ క్రీడాకారుడు గరికపాటి గోపిరాజు, తానా అధ్యక్షుడు లావు అంజయ్యచౌదరి, తానా ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకట రమణ, గన్నె వెంకట రమణ, పోతూరి వెంకట చలపతినాయుడు, తానా మాజీ అధ్యక్షుడు నాదెళ్ల గంగాధర్, ఎంసీఏ ఫౌండర్ డాక్టర్ గుత్తికొండ వరప్రసాద్‌లతో పాటు తానా చైతన్యస్రవంతి సభ్యులు, ఎన్‌ఆర్‌ఐ హాస్పటల్స్ నిర్వాహకురాలు కొత్తపల్లి అంజనాదేవి, ఎంసీఏ సభ్యులు, గ్రేస్ ఫౌండేషన్ సభ్యులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంసీఏ , తానా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
read more... |
 |
|
ఉచిత మెగా కంటి వైద్యశిబిరం 11.12.2022 మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్, జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మలిపెద్ది కృష్ణమూర్తి జ్ఞాపకార్ధం ప్రవాసాంధ్రుడు పరిమి బాలాజీ సహకారంతో పట్టణంలోని శ్రీ గుత్తికొండ లక్ష్మీనారాయణ కళ్యాణ మండపంలో శంకర్ కంటి ఆసుపత్రి వారిచే ఉచిత మెగా కంటి వైద్యశిబిరం నిర్వహించారు. శిబిరంలో 197 మందికి శంకర్ కంటి ఆసుపత్రి వైద్యులు నివేదితారెడ్డి, పామర్రు దివ్యలు వైద్యపరీక్షలు చేశారు. 118 మందిని శస్త్ర చికిత్సలకు ఎంపిక చేశారు. వీరికి త్వరలో ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించబడునని నిర్వాహకులు తెలిపారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంసీఏ కార్యదర్శి బాపారావు, మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్ వేజళ్ల ప్రకాశరావు, సభ్యులు ప్రభల సుబ్రహ్మణ్యం, వడ్లమూడి సాంబశివరావు, లక్ష్మీనారాయణ, హనుమంతరావు, కే.రామస్వామి, సత్యప్రసాద్, వాసుదేవరావు,క్యాంప్ ఇంఛార్జి మేక విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
read more... |
 |
|
బాలల దినోత్సవ వేడుకలు 14.11.2022 మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్(ఎంసీఏ) ఆధ్వర్యంలో వేజళ్ళ రమ్య, పద్మినిల ఆర్ధికసహకారంతో బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. విద్యార్ధులకు పలు సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. శాస్త్రీయ, జానపద, అభ్యుదయ, దేశభక్తి అంశాలపై నృత్యప్రదర్శన పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంసీఏ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్ వేజళ్ల ప్రకాశరావు, ఎంసీఏ కార్యదర్శి బాపారావు, సభ్యులు సాయివరప్రసాద్, సాంబశివరావు, లోకేశ్వరరావు, ప్రభాకరరావు, లక్ష్మీనారాయణ, బుచ్చిబాబు, సుబ్రహ్మణ్యం, రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు.
read more... |
 |
|
చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తూ బంగారు భవిష్యత్ 17.05.2022 మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో థాయ్‌లాండ్‌లో ఇటీవల జరిగిన థామస్ కప్ టోర్నీలో సత్తా చాటిన గుంటూరు జిల్లా క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్కు ఎంసీఏ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఎంసీఏ కార్యాలయంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తూ బంగారు భవిష్యత్ ఉంటుందని సాంస్కృతిక విభాగపు కార్యదర్శి జీ.హనుమంతరావు సూచించారు. వేసవిని పురస్కరించుకుని షటిల్, చెస్, స్కేటింగ్, కరాటే, యోగా తదితర విభాగాలలో ఇస్తున్న శిక్షణను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంసీఏ అధ్యక్షుడు రామకృష్ణబాబు, సభ్యులు డాక్టర్ వాసుదేవరావు, ప్రభాకరరావు, వడ్లమూడి సాంబశివరావు, సాయేశ్వరరావు, లక్ష్మీనారాయణ, రమేష్, కోచ్ రవి తదితరులు పాల్గొన్నారు.
read more... |
 |
|
ప్రతిభావంతులకు ప్రోత్సాహకాలు 19.02.2022 మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పరుచూరి రామకృష్ణయ్య చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో జగత్ జ్ఞాపకార్థం ఇరువురు పేద విద్యార్ధులు కే.మహిత్సాయి, పుష్పిత్కుమార్లకు స్కాలర్షిప్లు అందజేశారు. అదేవిధంగా షటిల్ బ్యాడ్మింటన్‌లో ప్రతిభ చూపుతున్న ఎంసీఏ క్రీడాకారులు అభిషేక్, అవినాష్లకు క్రీడాదుస్తులు, షూస్, షటిల్ బ్యాట్‌లను అందజేశారు. అబాకస్లో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనపరిచిన కోగంటి అరుణను అభినందించారు. ఎంసీఏలో శిక్షణ పొందుతూ గుంటూరు సుధాకర్‌రెడ్డి షటిల్ బ్యాడ్మింటన్‌లో శిక్షణకు ఎంపికైన క్రీడాకారులు హేమంత్కు, పరిమి బాలాజీ(యుఎస్‌ఏ వాలీబాల్ ఫ్యామిలి) సహకారంతో రూ.25వేలను అందజేశారు. కార్యక్రమంలో ఎంసీఏ అధ్యక్షుడు రామకృష్ణబాబు, మాజీ అధ్యక్షురాలు డాక్టర్ కృష్ణకుమారి, సభ్యులు డాక్టర్ కె.అనుజ, కే.హారిక, పరుచూరి శ్రీనాద్, ఎంసీఏ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్ వేజళ్ళ ప్రకాశరావు, హనుమంతరావు, కస్టమ్స్ అధికారి విజయేంద్ర, షటిల్ బ్యాడ్మింటన్ కోచ్ రవి, తదితరులు పాల్గొన్నారు.
read more... |
YEAR 2021
 |
|
బాలల దినోత్సవం 13.11.2021 మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేజళ్ళ శివరామప్రసాద్ జ్ఞాపకార్ధం వారి కుటుంబ సభ్యుల సహకారంతో బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ విభాగాలలో విద్యార్థులుకు నృత్యప్రదర్శన పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. న్యాయ నిర్ణేతలుగా నటరాజ్, గంగాభవానీలు వ్యవహరించారు. కార్యక్రమంలో ఎంసీఏ అధ్యక్షుడు జీ.రామకృష్ణబాబు, కార్యదర్శి బాపారావు, మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్ వేజళ్ళ ప్రకాశరావు, సాంస్కృతిక విభాగ నిర్వాహకులు సాయి ప్రసాద్, సభ్యులు వాసుదేవరావు, లక్ష్మీనారాయణ, సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు.
read more... |
 |
|
పేద విద్యార్థులకు ఉపకారవేతనాలు 14.03.2021 మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తపల్లి శ్రీనివాసరావు (యు ఎస్ ఎ) సహకారంతో ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఉపకారవేతనాలు పంపిణీ చేశారు.మన్నవ విరభద్రా కు 50వేలు, జి.కోటేశ్వరరావు కు 25వేలు, టి.సువర్ణ రాజు కు 10వేలు, ఎం.వైష్ణవి కి 10వేలు, ఏ మనోజ్ కు 30 వేలు, వై.లాస్య కు 25 వేలు చొప్పున అందజేశారు. కార్యక్రమంలో ఎంసీఏ అధ్యక్షుడు జి.రామకృష్ణ బాబు,కార్యదర్శి జి.బాపారావు,మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్ వి.ప్రకాశరావు, నగరం ఎస్విఆర్ ఏం కళాశాల ప్రిన్సిపాల్ హనుమంతరావు, పి.సుబ్రహ్మణ్యం, వి.సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
read more... |
YEAR 2020
 |
|
విద్యార్థులకు ఆడియో విజువల్ క్విజ్ ప్రోగ్రాం 28.01.2020 మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 9,10 తరగతుల విద్యార్థులకు ఫిజిక్స్, మాథ్స్ సబ్జెక్టులపై ఆడియో విజువల్ క్విజ్ ప్రోగ్రాం నిర్వహించారు.వివేకానంద విద్య విహార్ ప్రధమ, వనజచంద్ర పబ్లిక్ స్కూల్ ద్వితీయ, రామకృష్ణ పబ్లిక్ స్కూల్ మూడవ,మునిసిపల్ హైస్కూల్ నాల్గవ స్థానాలు సాధించిన విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంసీఏ ఉపాధ్యక్షులు డాక్టర్ వి.ప్రకాశరావు, సభ్యులు బాపారావు, సాంబశివరావు, సాయి ప్రసాద్, ప్రభల సుబ్రహ్మణ్యం, వాసుదేవరావు, తదితరులు పాల్గొన్నారు.
read more... |
YEAR 2019
 |
|
విద్యార్థులకు నోట్ పుస్తకాలు, స్కూల్ బ్యాగ్ ల పంపిణీ 15.07.2019 మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పవర్ మెక్ ఫౌండేషన్, చావ సీతారమంజనేయులు జ్ఞాపకర్ధo వారి కుటుంబ సభ్యుల సహకారంతో రెపల్లెలోని అనాధ ఆశ్రమం, పెదలంక, జువ్వాలపాలెం, ఆముదాలలంక ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకలు, పెన్నులు, గుడ్డ సంచులు పంపిణి చేశారు. కార్యక్రమంలో ఎంసీఏ సభ్యులు డాక్టర్ వి.ప్రకాశరావు, వాసుదేవరావు, సాయి ప్రసాద్, వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
read more... |
YEAR 2018
YEAR 2017
YEAR 2016
YEAR 2015
YEAR 2014
YEAR 2013
YEAR 2012
YEAR 2008-2011
|
|
|
|
|
|
|
|
|
|